PDL: ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని ఆత్మకూరు పట్టణ ఎస్సై డి.వి నారాయణరెడ్డి హెచ్చరించారు. వాట్సాప్లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.