ఖమ్మం నగరంలో ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నట్లు ఆయన పీఏ రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి తుమ్మల ముందుగా రోటర్ నగర్లో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.