TG: చెరువులు, నదులు, నాలాల పరిరక్షణతో పాటు, ఆయా పరిధిలోని భూ యజమానులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలాశయాల ఆక్రమణల తొలగింపు, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో.. నిర్మాణాలకు అనుమతి లేని FTL, MFL, బఫర్ జోన్లలోని భూములకు బదులుగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR)ను భారీగా పెంచింది.