కృష్ణా: పమిడిముక్కల (M) హనుమంతపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైటెక్ అంగులతో కోడిపందేల బరులు నిర్వహించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కుర్చీల ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల కోసం రెండు కార్వాన్ వాహనాలు, ఏసీ గుడారాలు, ఎల్సీడీ తెరలు ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీల సౌలభ్యం కోసం యూపీఐ సెంటర్ను ఏర్పాటు చేశారు.