AKP: సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం కోటవురట్ల మండలం పాములవాకలో మహిళలకు ముగ్గులు పోటీలు, యువతకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు సీనీయర్ ఐపీఎస్ అధికారి యూపీ రాష్ట్ర అడిషనల్ ఐజీ కే. సత్యనారాయణ బహుమతులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లో యువత ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.