MBNR: ఉమ్మడి MBNR జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్ ముసాపేట మండలం జానంపేట వద్ద 108 అంబులెన్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని అత్యవసర వైద్య పరికరాలు, మందులు, సిబ్బంది సామర్ధ్యాన్ని పరిశీలించారు. అత్యవసర సమయాల్లో 24/7 సేవలు అందించాలని సూచించారు. జిల్లా మేనేజర్ ఉదయ్, యాదయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.