TG: హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తాపడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. సంక్రాంతి కోసం హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీని పక్కకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.