ఏలూరు నగరంలోని 34వ డివిజన్ గూడ్సెషెడ్ రోడ్డులో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు శనివారం రాత్రి మంత్రి జనార్ధన రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరాభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.