TG: జనసేన పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జనసేన కమిటీలను రద్దు చేస్తూ.. వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలను నియమించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ప్రకటించారు. తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మార్పులు చేశామని తెలిపారు.