ADB: సుగంధ పంటల సాగు పెంపు దిశగా ఉద్యాన శాఖ ముందడుగు వేస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి నర్సయ్య పేర్కొన్నారు. సమీకృత మిషన్లో భాగంగా యూనిట్ రూ.20 వేల విలువగల దానియాలు 40% రాయితితో రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ అలేఖ్య, ఉద్యాన విస్తరణ అధికారులు గణేష్, భూమయ్యా, సతీష్, మహేందర్, శైలజ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.