VSP: జిల్లాలో చినగదిలి మండలం ముడసర్లోవ రిజర్వాయర్ చుట్టూ మహా విశాఖ నగరపాలక సంస్థకు చెందిన 836.38 ఎకరాల భూమిని పరిరక్షించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోరారు. అక్రమ గుర్రాల పార్కు, బీఆర్టీఎస్ రోడ్డుపై కబ్జాలు తొలగించి తాత్కాలిక లీజులు రద్దు చేయాలని జీవీఎంసీ పీజీఆర్ఎస్లో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.