E.G: నిడదవోలులో 61 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 44,80,458 విలువైన చెక్కులను మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు CMRF ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.