AP: గిడుగు రామ్మూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదని సీఎం చంద్రబాబు అన్నారు. నేను తెలుగువాణ్ని, నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఇది.. వేదికకు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరమని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి అవార్డులు ఇచ్చామని చెప్పారు.