TG: తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమంలోకి వచ్చానని MLC కవిత అన్నారు. ‘BRSలో చేరకముందే జాగృతిని స్థాపించాను. తెలంగాణ కోసమే ఉద్యమంలోకి వచ్చా. కేసీఆర్తో మాట్లాడే ధైర్యం నాకు మాత్రమే ఉంది. కాబట్టి సమస్యలన్నిటినీ ఆయనకు వివరించా. TRSను BRSగా మార్చాలనుకున్న నిర్ణయం సరైంది కాదు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకున్నారు’ అని ప్రశ్నించారు.