MDK: తూప్రాన్ మున్సిపల్ ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్స్‌ను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ కళాశాలను మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి తనిఖీ చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే భవనం వినియోగించబడినట్లు అదనపు కలెక్టర్ నగేష్‌కు వివరించారు.