E.G: గోపాలపురంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం జరిగింది. పార్టీ ఇన్ఛార్జ్ తానేటి వనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో కీలక మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ మారిన ఎంపీపీపై వాదలకుంట గ్రామస్థులు కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో నియోజకవర్గ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.