RR: కొత్తూరు మండలంలోని మక్తగూడ, మల్లాపూర్, సిద్ధాపూర్ గ్రామాలకు ఎంపీ డీకే అరుణ హైమాక్స్ లైట్స్ మంజూరు చేశారని బీజేపీ కొత్తూరు మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ నిధుల ద్వారా హైమాక్స్ లైట్స్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.