TPT: చంద్రగిరి నియోజకవర్గంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులకు సూచించారు. 0-5 ఏళ్ల పిల్లలందరికీ చుక్కలు పడేలా ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సమన్వయంతో పని చేయాలని అన్నారు. పోలియో కేంద్రాల్లో నీడ, నీరు, కూర్చునే ఏర్పాటు ఉండాలని, రాలేని పిల్లలకు 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయాలని ఆదేశించారు.