AP: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిన్నటి వరకు రాష్ట్రంలో 9,236 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 1,806 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 15కు చేరింది. ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్తోపాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు కారణమని వైద్యులు గుర్తించారు.