NLG: చిట్యాల మండలంలోని వెంబావి సర్పంచ్ ఎన్నికలలో ఇరువురి మధ్య జరిగిన హోరాహోరీ పోటీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గుణగంటి అలివేలు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సమీప అభ్యర్థి గుణగంటి పారిజాతపై 129 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకున్నారు. ఇక వార్డుల విషయానికి వస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 6, కాంగ్రెస్ బలపరిచిన వారు 2 వార్డుల్లో గెలుపొందారు.