అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లలో రాత్రి ప్రయాణాలపై నిషేధం విధించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు. ఘాట్ రోడ్లు క్లిష్టంగా ఉండటం, పొగ మంచు పెరగడం వంటి కారణాలతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై భారీ వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.