MBNR: కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జడ్చర్ల మండలం నుసురుల్లాబాద్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ మేరకు జడ్చర్ల సీఐ కమలాకర్ను కలిసి ఫిర్యాదు చేశారు.