NLR: చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్- టీచర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సాదర స్వాగతం పలికారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన ప్రదర్శనలను మంత్రి ఆనం పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.