Super star Krishna: ‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్
తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ(Super star Krishna) సినీ కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు(Movies) చేసి విజయం సాధించారు. కొత్త ప్రయోగాలు చేస్తూ సరికొత్త కథలను ప్రేక్షకులకు అందించారు. మొదట్లో ‘గూఢచారి 116’ సినిమా(Gudachaari 116)ను తీసి తెలుగు తెరకు యాక్షన్ మూవీస్(Action Movies)ని పరిచయం చేశారు. అప్పట్లో ఆ గుర్రపు స్వారీలు, భారీ చేజింగులు సినీ ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించాయి.
‘మోసగాళ్లకు మోసగాడు’ రీ రిలీజ్ ట్రైలర్:
తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో కృష్ణకు జోడీగా విజయనిర్మల నటించింది. 1971లో వచ్చిన ఆ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఆ సినిమాకు ఆదినారాయణ రావు మ్యూజిక్ అందించారు. ‘కోరినది నెరవేరినది’ అంటూ సాగే పాట అప్పట్లో అతి పెద్ద హిట్ సాంగ్‌గా నిలిచింది. తాజాగా కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రీ రిలీజ్(Re Release) చేయనున్నారు. 4K రిజల్యూషన్‌తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరోసారి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుండటంతో కృష్ణ(Super star Krishna) ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.