హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.
కొన్ని హాలీవుడ్ సినిమాలు(Hollywood Movies) తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. హాలీవుడ్ నటీనటులకు సైతం ఇక్కడ అభిమానులున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే హీరో టామ్ క్రూజ్ (Tom cruise). ప్రపంచ వ్యాప్తంగా ఈ హాలీవుడ్ హీరోకు ఫ్యాన్స్ ఉన్నారు. అతను చేసే యాక్షన్ సీన్స్ (Action scenes)కి ఫిదా అవ్వని వారంటూ ఎవ్వరూ ఉండరు. టామ్ క్రూజ్ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మూవీ మిషన్ ఇంపాజిబుల్ (Mission Impossible movie).
‘మిషన్ ఇంపాజిబుల్ 7’ ట్రైలర్:
మార్వెల్ సినిమాలు(Marvel movies) తర్వాత ఇండియన్ మూవీ లవర్స్ ఎక్కువగా ఈ మిషన్ ఇంపాజిబుల్(Mission Impossible) సిరీస్ ను బాగా ఇష్టపడ్డారు. ఇప్పటి వరకూ ఈ సీరిస్ నుంచి 6 భాగాలు విడుదలయ్యాయి. తాజాగా ఇప్పుడు 7వ భాగం విడుదలకు సిద్ధమైంది. టామ్ క్రూజ్(Tom cruise) ఈసారి ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించనున్నాడు. 7వ భాగాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ ను జులై 14న విడుదల చేయనున్నారు.
ఈ మూవీ కోసం టామ్ క్రూజ్(Tom cruise) మరిచిపోలేని సాహసం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. 60 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ బైక్ తో కొండపై నుంచి కిందకి దూకుతాడు. ఈ సాహసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది. ఈ ఫస్ట్ పార్ట్ ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.