NLG: గుండ్లపల్లి(డిండి) మండలం ఎర్రగుంటపల్లిలో ”జనహిత – ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలునాయక్ శనివారం వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించారు.