NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కొడవలూరు ఎంపీడీవో వెంకట సుబ్బారావు ఆధార్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ ఆధార్ కేంద్రంలో 5 సంవత్సరం నుంచి 15 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఆధార్ అప్డేషన్, ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ మార్పు చేయటం తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.