»Maharashtra Brother Mistakes Period Blood To Be Result Of Sex Tortures 12 Yr Old Sister To Death
Period blood: చూసి తప్పు చేసిందనుకొని..అన్న దారుణం
ఓ సోదరుడు(brother) తన చెల్లెలి విషయంలో దారుణానికి పాల్పడ్డాడు. రుతుక్రమం కారణంగా వచ్చిన రక్తాన్ని తప్పుగా భావించిన ఓ 30 ఏళ్ల సోదరుడు తన మైనర్ సోదరిని చిత్రహింసలకు గురిచేశాడు. అది శృంగారం ద్వారా వచ్చిన బ్లడ్ అనుకుని ఆమెను వేధించసాగాడు. దీంతో మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆ మైనర్ బాలిక మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
సినిమాలు(movies) చూసి చాలా మంది చెడిపోతున్నారు. నిజా నిజాలు తెలుసుకోకుండా సినిమాల్లో చూపించిందే నిజమని భావిస్తున్నారు. తాజాగా ఓ అన్న(brother) తన చెల్లి(sister) విషయంలో ఇలానే పొరపాటుపడి, ఏకంగా ప్రాణాలు తీసేశాడు. సినిమాల్లో చూపించినట్లు తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తం వస్తుందని నమ్మి, పీరియడ్స్ వచ్చిన చెల్లిని అనుమానించి హత్య చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర(Maharashtra)లోని థానే నగరంలోగల ఉల్హాస్నగర్ ఏరియాలో ఓ 12 ఏళ్ల బాలిక(12 years girl) తన అన్న, వదినలతో కలిసి జీవిస్తోంది. చిన్న వయసులోనే కన్నవాళ్లను కోల్పోవడంతో అన్నావదినలే ఆమెను పెంచుతున్నారు. అయితే, బాలిక ఇటీవల మెచ్యూర్ అయ్యింది. అంటే ఆమెకు నెలసరి రావడం మొదలైంది. చిన్న పిల్ల కావడంతో చూసుకోలేదు. అది ఆమె అన్న కంట పడింది. బాలిక దుస్తులపై రక్తం చూసి ఆయన మరోలా ఊహించుకున్నాడు.
ఎవరితోనో తన చెల్లి కలయికలో పాల్గొందని, అందుకే రక్తం(blood) వస్తుందని భావించాడు. వెంటనే కోపంతో ఊగిపోయాడు. బాలికను చిత్రవధ చేశాడు. ఒంటిపై పట్టుకారతో వాతలుపెట్టాడు. ముఖం, చేతులు, కాళ్లు అన్ని ప్రదేశాల్లో వాతలు పెట్టాడు.
దాంతో బాలిక పరిస్థితి విషమించింది. దాంతో ఇరుగుపొరుగుతో కలిసి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలేసింది. సరైన అవగాహన లేకపోవడం వల్ల అతను అలా చేసి తన తోడబుట్టిన చెల్లిని చంపేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.