KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయంలో లా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట రావు తెలిపారు. లా 3, 5 ఏళ్ల కోర్సుల 2, 4, 6, 8వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి నవంబర్ 1వ తేదీ వరకు కర్నూలు ఉస్మానియా కళాశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 861 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.