MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలోని ఓ కాలనీలో పిచ్చికుక్కలు సోమవారం స్వైర్యవిహారం చేసి నలుగురు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కుక్కల బెడదపై అధికారులు చర్యల తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.