JN: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామలోని బతుకమ్మ కుంటలో కబడ్డీ క్రీడాభిమానులు దీపాలతో కబడ్డీ కోర్టును ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ దీపావళితో క్రీడాకారుల జీవితాల్లో చీకటి పోయి వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల కుటుంబాలకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు రావాలని కోరుకున్నారు. కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.