PPM: చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నాయకులు నిప్పు పెట్టి దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ గురువారం పార్వతీపురం టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులు ను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనుకుంటున్నారు అని తెలిపారు.