ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని మడూర్ కాంప్లెక్స్ హెచ్ఎం రవిందర్ రెడ్డి సూచించారు. మంగళవారం చిన్నశంకరంపేట మండలం మడూర్ జడ్పీ పాఠశాలలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన భోధనకు ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీస సామర్థ్యాలు పరిశీలించాలన్నారు.