GDWL: నడిగడ్డ ఇలవేల్పు దైవం జమ్మిచేడు జమ్ములమ్మను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల జ్యోతి దంపతులు గురువారం దర్శించుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రంతో సత్కరించారు.