జగిత్యాల జిల్లాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. కొండా లక్ష్మణ బాపూజీ బాటలో నేటి యువతరం నడవాలని సూచించారు.