కృష్ణా: దివంగత నేత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు 28వ వర్ధంతి సందర్భంగా కోడూరు మండల జనసేన పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొని ప్రారంభించారు. ముందుగా కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ప్రారంభించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు