JN: 4 కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన రఘునాథపల్లిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన కన్హాయ్ కుసలియా అనే వ్యక్తి ట్రైన్లో గంజాయినీ తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.2.07 లక్షలు ఉంటుందన్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.