NRML:దొంగలించిన పురాతన వస్తువును పోలీసులు రికవరీ చేసిన ఘటన గురువారం సోన్ మండలంలో జరిగింది. ఏఎస్పీ రాజేష్ మీనా వివరాల ప్రకారం.. ఉత్తరాది మఠం వద్ద బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన కొన్ని పురాతన వస్తువులు దొంగలింపబడగా బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి వాటిని దొంగలించిన గ్రామానికి చెందిన శివరాత్రి శినాపతిని అరెస్టు చేసి కేసు నమోదు చేసామన్నారు.