బన్నీ -సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ మూవీ సంచనలంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ దుమ్ముదులిపాడు పుష్పరాజ్. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు పుష్ప పార్ట్ వన్‌కు బ్రహ్మరథం పట్టారు. అందుకే పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
సుకుమార్ సైతం అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను పెరిగిన అంచనాలను అందుకోవడం కోసం గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే ఈ సినిమా టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్టు టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా పై అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు.. అదిరిపోయే అప్టేట్ ఇచ్చాడు. అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్లో పుష్ప2 అప్టేట్ కావాలని పట్టు బట్టారు బన్నీ అభిమానులు. దాంతో ‘తనను అందరూ ‘పుష్ప-2’ అప్డేట్ గురించి అడుగుతున్నారని.. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నా.. ‘పుష్ప-2’తో స్క్రీన్లు పగిలిపోతాయని అన్నాడు బన్నీ వాసు.
మామూలుగా అయితే స్క్రీన్లు చిరిగిపోతాయని అంటుంటారని.. కానీ ‘పుష్ప-2’ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని.. అందుకే స్క్రీన్లు పగిలిపోతాయని అన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక బన్నీ కూడా చిన్న అప్టేట్ అంటూ.. ‘పుష్ప1 తగ్గేదేలే అయితే.. పుష్ప-2 అసలు తగ్గేదేలే’ అని అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో ఈ హిట్ సీక్వెల్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. మరి పుష్ప2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.