VZM: విజయనగరం రైల్వే స్టేషన్ను ఎంపీ అప్పలనాయుడు గురువారం సందర్శించారు. టికెట్ కౌంటర్, రైల్వే ఎంక్వయిరీ సిబ్బందితో మాట్లాడి ప్రయాణికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల విశ్రాంతి గదులు, టాయిలెట్లను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.