విశాఖ: జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి ఓ యువకుడుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. టూ టౌన్ పరిధిలో డాబా గార్డెన్స్ వద్ద యువకుడిపై కత్తితో దాడి జరగడంతో కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తి ఎల్లంతోటకు చెందిన శెట్టి ఎల్లాజీ అలియాస్ వడ్డీగా గుర్తించారు. టూటౌన్ సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.