BHPL: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాన్ని చెట్టు తీగలు చుట్టుకొని ప్రమాదం నెలకొంది. అయితే వర్షాకాలంలో తడిచిన ఈ తీగలు విద్యుత్ తీగలను తాకితే షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చని శనివారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పై విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.