HNK: వాహనదారులు మద్యం తాగి వాహనం నడిపితే జైలు తప్పదని మడికొండ సీఐ కిషన్ వాహనదారులకు సూచించారు. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా మడికొండ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక మడికొండ చౌరస్తాలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.