AP: పోలవరం కోసం ఇప్పటివరకు రూ.19,396 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు చెప్పారు. ‘పోలవరం కోసం కేంద్రం రూ.17,860 కోట్లు చెల్లించింది. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన 96,660 కుటుంబాలకు తొలిదశలో రూ.1,203 కోట్లు అందించాం. ఇంకా 18,266 కుటుంబాలకు రూ.1,340 కోట్లు చెల్లించాలి’ అని తెలిపారు.