సత్యసాయి: డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. డీసీఏ పనితీరు, సాధిస్తున్న ఫలితాలపై ఆరా తీశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సమర్థవంతంగా పనిచేయాలని, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీలు చేయాలని కోరారు. యువత, ప్రజలను వ్యసనాలకు గురిచేసే మందుల విక్రయంపై దృష్టి పెట్టాలని సూచించారు.