ఢిల్లీలో (Delhi) రెండు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు (Heavy Rains), ఉరుములతో కూడిన బలమైన గాలులు (Strong winds followed by a thunderstorm) వీస్తున్నాయి. బుధ, గురు వారాలు వరుసగా వర్షాలు పడ్డాయి. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని (similar weather conditions) వాతావరణ శాఖ (weather department) అంచనా వేసింది. పశ్చిమ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఇబ్బందులకు గురి చేస్తోంది. సివిల్ లైన్స్, రోహిణి, తదితర ప్రాంతాల్లో చెట్లు నెలకూలాయి. దీంతో రవాణా ఇబ్బంది అయింది. నోయిడాలో గోడ కూలి ఇద్దరు గాయపడ్డారు. కీలక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. గురువారం ఉదయం సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీలో ఎనిమిదిన్నర గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల మధ్య నగరంలో 5.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. పాలంలో 1.1 మిల్లీ మీటర్లు, లోధి రోడ్, రిడ్జ్, ఆయా నగర్ లలో 7.6 మిల్లీ మీటర్లు, 4.5 మిల్లీ మీటర్లు నమోదయ్యాయి. తూర్పు ఢిల్లీలోని వడగళ్ళ వాన (hailstorm) కురిసింది. గురువారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు వీచాయి. ఢిల్లీని భారీ వర్షాలు (heavy showers) ముంచెత్తాయి. పటేల్ నగర్, బుద్ధ జయంతి పార్క్, ప్రెసిడెంట్ హౌస్, రాజీవ్ చౌక్, ఢిల్లీ కంటోన్మెంట్, ఇండియా గేట్, సఫ్దర్ గంజ్, లోడీ రోడ్డులో వర్షం కురిసింది.
ఢిల్లీలో అకాల వర్షాల కారణంగా ఇక్కడి నుండి 17 విమానాలను దారి మళ్లించారు. ఎనిమిది విమానాలను లక్నో, మరో ఎనిమిది విమానాలను జైపూర్, ఒక విమానాన్ని డెహ్రాడూన్ కు పంపించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానాల షెడ్యూల్ మార్పుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా తెలిపే ప్రయత్నం కూడా అనేక విమానయాన సంస్థలు చేశాయి. కాగా ఢిల్లీలో అకాల వర్షాలకు ప్రెష్ వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షలా కారణంగా ఢిల్లీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ కనిపించింది.