అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. అసెంబ్లీ అంటే ప్రజల రక్షణ కోసం..హక్కుల కోసం చట్టాలు చేసే అత్యంత బాధ్యతాయుతమైన సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే(Assembly meetings) ఎటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా అశ్లీల దృశ్యాలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ (MLA Jadab Lal Nath) పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) అంటే ప్రజల సమస్యల గురించి చర్చించే వేదిక. అసెంబ్లీ అంటే ప్రజల రక్షణ కోసం..హక్కుల కోసం చట్టాలు చేసే అత్యంత బాధ్యతాయుతమైన సభ. అటువంటి సభలో బీజేపీ ఎమ్మెల్యే(Assembly meetings) ఎటువంటి బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా అశ్లీల దృశ్యాలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ (MLA Jadab Lal Nath) పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో ఏం జరుగుతుందో..ఏ అంశంపై చర్చ జరుగుతుందో కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తనపాటికి తాను అందుకే వచ్చినట్లుగా అసెంబ్లీ సమావేశాల్లో తన స్మార్ట్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు చిక్కారు బగ్బాసా (Bugbasa) నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్..ఈ వీడియో బయటకు రావటంతో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
కాగా కర్ణాటకలో బీజేపీ (BJP) ప్రభుత్వ హయాంలో కూడా ఇద్దరు మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో పోర్న్ వీడియోలు చూస్తు అడ్డంగా బుక్ అయ్యారు. ఇదికాస్తా బయటపడటంతో సదరు మంత్రులు విద్యా ప్రయోజనాల కోసం రేవ్ పార్టీల గురించి తెలుసుకోవటానికి వీడియోలు చూస్తున్నామంటూ సమర్ధించుకున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇటువంటి సిగ్గుమాలిన పనులు చేయటానికా? అనే విమర్శలు వస్తున్నాయి ఇటువంటి ప్రజాప్రతినిథులు చేసే ఘనకార్యాలపై..ఈ విషయంపై స్పందించిన బీజేపీ.. వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేను ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ అశ్లీల వీడియోలు చూశారన్న ఆరోపణలపై ఎమ్మెల్యే నాథ్ ఇంకా స్పందించలేదు. సభ ముగిసిన వెంటనే ఆయన అసెంబ్లీ(Assembly) నుంచి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj).. సిగ్గుచేటు అని ట్వీట్ (Tweet) చేశారు.