ATP: తన పేరు చెప్పి కొంతమంది దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దందాలకు పాల్పడితే తనవారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. ప్రజల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులపై దౌర్జన్యాలకు దిగితే సహించే ప్రసక్తే లేదన్నారు.