ATP: తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అధికారి DPM లక్ష్మణ్, జర్మనీ దేశస్థులు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి రైతులు సాగుచేస్తున్న వివిధ రకాల ప్రకృతి వ్యవసాయ పంటలను జర్మనీ దేశస్థులు వీక్షించారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమితో పాటు మనిషి ఆరోగ్యం బాగుంటుందని వారికి రైతులు వివరించారు.