AKP: పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన పనుల ప్రగతి బిల్లులు సమర్పణ పెండింగ్ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.